హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత

కోనసీమ: అమలాపురం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన అయితాబత్తుల సుభాషిణి ఆ పార్టీకి రాజీనామా చేసి శనివారం జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అమలాపురం నియోజకవర్గానికి ప్రస్తుతం జనసేన ఇన్‌ఛార్జ్ లేకపోవడంతో సుభాషిణికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా? అనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.