హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పట్టణంలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

MDK: మెదక్ పట్టణంలో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత, పకడ్బందీ ట్రాఫిక్ నియంత్రణ కల్పించామని ఆయన తెలిపారు. నిమజ్జనానికి విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ (IPS) ప్రత్యేకంగా అభినందించారు.