హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయం'

W.G: పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో పెంటపాడు తాజా మాజీ ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి - కృష్ణ ప్రసాద్ దంపతులు కలిసి మండల అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.