హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రిమ్స్ కార్మికుల వేతనాల బాధ్యత కలెక్టరే కొనసాగించాలి'

ADB: కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు రిమ్స్, సూపర్ స్పెషాలిటీ కార్మికులకు వేతనాలు, PF-ESI చెల్లించే బాధ్యతను కలెక్టరే కొనసాగించాలని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్‌లో సమావేశమై మాట్లాడారు. కొత్త కాంట్రాక్టర్ పేరుతో తక్కువ వేతనాలు ఇస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.