హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్ దొంగతనాల కేసును ఛేదించిన పోలీసులు

అన్నమయ్య: రాయచోటి అర్బన్‌ పోలీసులు బైక్ దొంగతనం కేసులను ఛేదించారు. మైనర్‌ బాలురను గుర్తించి, వారి నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 12 బైక్‌లను పోలీసులు రికవరీ చేశారు. వాహనాల చోరీకి సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు, నిందితులపై జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.