హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై 293 కేసులు నమోదు

కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో 293 కేసులు నమోదు చేసి రూ.68,545 జరిమానా విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్, అధిక వేగం, మొబైల్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తెలిపారు.