హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మమ్మ మర్రిమాను వద్ద నేడు వేడుకలు

SS: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు తిమ్మమ్మ మర్రిమాను ప్రాంగణంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ హాజరుకానున్నారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు భూమిపూజ చేయనున్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.