హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో విస్తృతంగా ‘వజ్ర ప్రహార్’ తనిఖీలు

ATP: నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా 'వజ్ర ప్రహార్' కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ప్రాంతాల్లోని 349 ఇళ్లలో తనిఖీలు చేసి, రికార్డులు లేని 34 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత ఎన్డీపీఎస్ కేసుల నిందితులు ముగ్గురితో పాటు 515 మంది అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.