హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుకు 'రెడ్స్' సంస్థ రూ. 50 వేల ఆర్థిక సాయం

SS: వర్షాభావంతో బోర్లు ఎండిపోయి, చీనీ తోట నష్టపోయి అప్పులపాలైన బత్తలపల్లి మండలం గుమ్మళ్ళకుంట గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డికి 'రెడ్స్' సంస్థ అండగా నిలిచింది. కష్టాల్లో ఉన్న నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రెడ్స్ డైరెక్టర్ భానుజ శనివారం రూ. 50,000 చెక్కును అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న సంస్థకు రైతు నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.