హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వనపర్తి జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా జిల్లా అధికారులంతా అక్కడికి వెళ్లాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.