VSP: అగనంపూడి సీడబ్ల్యూ సీలో సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో రెండు రోజుల పాటు శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ పీఆర్వో ఎ.బంగర్రాజు తెలిపారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు రోగులకు నేత్ర పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందిస్తారన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 30 నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం


