పల్నాడు: నరసరావుపేట కిడ్నీ కేర్ ఆసుపత్రిలో 76 ఏళ్ల వృద్ధుడి మూత్రాశయం నుంచి 270 గ్రాముల భారీ రాయిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. 10×6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ రాయి తొలగింపు అరుదైన శస్త్రచికిత్సగా వైద్యులు తెలిపారు. మూత్ర విసర్జనలో ఇబ్బందులు, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని యూరాలజిస్ట్ డాక్టర్ జహీర్ అబ్బాస్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో అరుదైన శస్త్రచికిత్స


