హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజే సౌండ్‌‌‌కు ఆగిన గుండె

VSP: ఎన్ఏడీ కొత్తరోడ్డు అంబేద్కర్‌నగర్‌-శాంతినగర్‌ ప్రాంతంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. డీజే సౌండ్‌ అధిక శబ్దం మధ్య ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై స్థానికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.