హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి వడ్డిపోలమ్మ ఉత్సవాలు

VSP: భీమిలి పట్టణం రెల్లివీధి ప్రజల ఆరాధ్య దేవత వడ్డిపోలమ్మ ఉత్సవాలు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 28న తొలేళ్లు, 29న అనుపోత్సవం, 30న అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ కోరింది.