జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, సిబ్బంది ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందని అదనపు ఎస్పీ తెలిపారు. ఆమె ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన అదనపు SP


