హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ తీగ తగిలి కాపరితో సహా గొర్రెలు మృతి

VSP: అగనంపూడి ఫార్మాసిటీ పునరావాస కాలనీలో శనివారం సాయంత్రం తెగిపడిన విద్యుత్ తీగ తగిలి గొర్రెల కాపరి ఉప్పిలి బంగారయ్య(30)తో పాటు 12 గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం, సాయిప్రియ లేఅవుట్ సమీపంలో రోడ్డుపై తెగిపడి ఉన్న తీగను విద్యుత్ సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.