హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో 1,220 మంది అనర్హ ఓటర్ల గుర్తింపు

విశాఖ జిల్లాలో 1,220 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విశాఖ తూర్పులో అత్యధికంగా 382 మంది, భీమిలిలో 219, ఉత్తరంలో 199, పెందుర్తిలో 155, దక్షిణంలో 121, పశ్చిమంలో 110, గాజువాకలో 34 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో 2002 ఓటర్ల జాబితాలతో మ్యాపింగ్ చేసి జిల్లా వ్యాప్తంగా 2,29,924 మందికి నోటీసులు జారీ చేశామన్నారు.