హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్‌గా సంజీవ్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

KMR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నూతన ఛైర్మన్‌గా ఎం. సంజీవ్ రెడ్డి ముక్కారా శనివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య సహాయం విపత్తు సహాయక చర్యలను మరింత విస్తరిస్తాయన్నారు. 'మానవ సేవయే మా లక్ష్యం' అనే స్ఫూర్తితో రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేసి, పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.