KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన మూదాం రోహన్ భారతీయ వైమానిక దళంలో ఉద్యోగం సాధించాడు. జిల్లా కేంద్రంలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసిన రోహన్ ఐఏఎఫ్ రిక్రూట్మెంట్ టెస్టులో అర్హత సాధించి, మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు. రాజస్థాన్ జైపూర్‌లోని వైమానిక కార్యాలయంలో విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించిన జిల్లా వాసి


