హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు అన్నదమ్ముల ఎంపిక

NZB: వర్ని మండలం చింతల్‌పేట్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సురేశ్ చౌదరి, మహేశ్ చౌదరి రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. శనివారం కామారెడ్డి జిల్లా కొత్తాబాదిలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సురేశ్ చౌదరి అండర్-17, మహేశ్ చౌదరి అండర్-14 విభాగాల్లో ఎంపికయ్యారు. వీరిద్దరూ నిజామాబాద్ శివారులోని బోర్గాం హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు.