హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేములదీవి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ..!

W.G: వేములదీవి వెస్ట్ గ్రామంలో శనివారం తహసీల్దార్ నాగార్జున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని బీసీ హాస్టల్, అంగన్‌వాడీా కేంద్రం, జడ్పీ హైస్కూల్, ఎంపీపీ పాఠశాలలను సందర్శించి సేవలు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించి, విద్యార్థులతో కలిసి కూర్చుని స్వయంగా భోజనం రుచి చూశారు.