నంద్యాల జిల్లాలో పలు గ్రామాల్లో పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని, అత్యవసర సమయంలో 112కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో శాంతిభద్రతలపై పోలీసుల సమీక్ష


