హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో 100% విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయమే కూటమి లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు స్థాయిలో నేతలు సమన్వయంతో పనిచేసి కార్యకర్తల్లో అసంతృప్తికి తావులేకుండా చూడాలని నల్లమిల్లి సూచించారు.