MDCL: వాతావరణంలో మార్పుల కారణంగా శరీరంలో నీరు, లవణాల సమతుల్యత తగ్గి నీరసం, అలసట వంటి సమస్యలు రావచ్చని ఉప్పల్ PHC వైద్యురాలు డా. సౌజన్య తెలిపారు. ఇలాంటి సమయంలో ORS, పండ్ల రసాలు తీసుకోవడంతో పాటు పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలని సూచించారు. రోజూ తగినంత నీరు తాగాలని, అలసట ఎక్కువైతే విశ్రాంతి తీసుకుని అవసరమైతే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
నీరసంగా ఉంటే ORS తీసుకోండి: PHC వైద్యురాలు


