హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కోతుల బెడదకు నివారణ చర్యలు'

BDK: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టినట్లు మేయర్‌ మూడ్‌ గణేష్‌ తెలిపారు. శనివారం రామవరం 16వ డివిజన్‌ అంబేద్కర్‌ చమన్‌లో కోతులను పట్టేందుకు బోనులు ఏర్పాటు చేశారు. కోతుల పట్టివేత ప్రక్రియను మేయర్‌ పరిశీలించారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు దశలవారీగా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.