హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు పర్యాటక ప్రదేశాల సందర్శన'

ములుగు జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 140 మంది విద్యార్థులకు పర్యాటక ప్యాకేజ్‌ టూర్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు టూర్‌ను ప్రారంభించారు. విద్యార్థులు జాకారం శివాలయం, రామప్ప దేవాలయం, రామప్ప సరస్సు, తాడ్వాయి అభయారణ్యంలోని జలగలంచ, వ్యూపాయింట్‌ను సందర్శించారు. పర్యాటక, చారిత్రక, అటవీ సంపదపై అధికారులు అవగాహన కల్పించారు.