హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చ

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) హైదరాబాద్‌లో MA&UD శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకే శ్రీదేవి (ఐఏఎస్)ను కలిశారు. ఈ సందర్భంగా భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర మున్సిపాలిటీల అభివృద్ధిపై చర్చించారు. మున్సిపల్ కమిషనర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో కలిసి మౌలిక వసతులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన పనుల ప్రతిపాదనలు అందజేశారు.