హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీసీ పనులను త్వరగా పూర్తిచేయాలి'

MDK: తూప్రాన్ కోర్టు భవనం వద్ద సీసీ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ ఆదేశించారు. శనివారం తూప్రాన్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న కోర్టు భవన మరమ్మతు పనులను పరిశీలన చేశారు. సీసీ పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఆర్డీఓ బావయ్య, డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట్ రాజాగౌడ్, డీటీ శ్రీకాంత్ పాల్గొన్నారు.