హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో వైభవంగా గరుడ సేవ

CTR: శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి పౌర్ణమి గరుడ సేవ శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులతో భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.