హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాపుపై దాడి.. ఒకరి అరెస్ట్

సత్యసాయి: పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై సీఐ యువరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో జరిపిన ఈ తనిఖీల్లో ఒబులప్ప అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, 31 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు.