హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత

NRPT: నారాయణపేట పట్టణంలోని పలు కాలనీల్లో శనివారం అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బీసీ కాలనీ సతీష్ గౌడ్ ఇంట్లో 35.43 లీటర్లు, నవీన్ గౌడ్ వద్ద 18.39 లీటర్లు, కలాల్ వాడి సురేష్ గౌడ్ వద్ద 21.90 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు. రూ. 42,158 వేలు ఉంటుందన్నారు.