హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NLR: సంగం మండలం మర్రిపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు పంది మహేంద్ర (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఇంట్లో విద్యుత్ వైర్లు బిగుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.