హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లి వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు

కోనసీమ: అత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి వారి దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.