హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పురుగు మందుతో పంట నష్టం'

NZB: బెల్లాల్ గ్రామంలో పురుగుల మందు పిచికారీతో వరి పంట దెబ్బతిని ఎండిపోయిన ఘటనపై వ్యవసాయ శాఖ ఏవో సంతోష్ పరిశీలించారు. నష్టపోయిన పొలాన్ని పరిశీలించి, ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన అడ్వాంటేజ్, అమృత ఇన్‌సెక్టిసైడ్స్ శాంపిళ్లను సేకరించారు. నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేస్తామని ఏవో తెలిపారు.