హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ సభ్యుడిగా డా.బాలు ఏకగ్రీవ ఎన్నిక

KMR: జిల్లా రెడ్‌క్రాస్ సభ్యుడిగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రక్తదాతల సమూహ వ్యవస్థాపకులు డా. బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రెడ్‌క్రాస్ 2007 నుంచి రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తాను ఇప్పటివరకు 84 సార్లు రక్తదానం చేశానని, వేలాది మందికి అత్యవసర సమయంలో సకాలంలో రక్తాన్ని అందించినట్లు తెలిపారు.