హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'CMRFతో పేదలకు కార్పొరేట్ వైద్యం'

BPT: అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు రూ.44.59 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, LOCతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం అందజేశారు. 85మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఐదుగురికి ఎల్ఓసీలు అందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.