BDK: ఇల్లందు మండలంలో ఆర్టీసీ డిపోలో శనివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ సుభాషిని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించారు. కొత్త బస్సు సర్వీసులు, బస్టాప్‌ల వద్ద బస్సులు నిలపడం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంపై ప్రయాణికులు సమస్యలు తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని డీఎం హామీ ఇచ్చారు.
తెలంగాణ
ప్రయాణికుల సమస్యలపై ‘డయల్ యువర్ డీఎం’


