హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ఉచిత ఉపకారణాల పంపిణీ

నల్లగొండ జిల్లాలో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏఎల్ఐఎంసీఓ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న నల్లగొండ, 29న మిర్యాలగూడ, 30న దేవరకొండ, అక్టోబర్ 1న చండూరులో శిబిరాలు జరుగుతాయి. ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, శ్రవణ యంత్రాలు అందించనున్నారు. అర్హులు ఆధార్, వైద్య ధ్రువీకరణ, రేషన్‌కార్డు, ఫొటో, యూడీఐడీ కార్డుతో హాజరుకావాలి.