ADB: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్టోబర్ 8, 9 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు DPRO విష్ణువర్ధన్ శనివారం తెలిపారు. పాత్రికేయ నైపుణ్యాలపై ఇచ్చే ఈ శిక్షణకు గరిష్టంగా 75 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల జర్నలిస్టులు అక్టోబర్ 5లోపు DPRO కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు: DPRO


