హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయలలో ఘనంగా పౌర్ణమి వేడుకలు

MDK: పాపన్నపేట మండలం ​శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ వన దుర్గా భవానీ మాతకు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పల్లకీ సేవను కంటికి ఇంపుగా నిర్వహించారు. భక్తులు, మహిళలు మంగళహారతులతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.