SRD: సిర్గాపూర్ మండల పరిధిలోని లొంక తాండా శివారులో గల ఓ పొలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై మహేష్ తమ సిబ్బందితో కలిసి శనివారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రూ. 12,050 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
తెలంగాణ
ఆరుగురు జూదరుల అరెస్ట్


