హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగుల వేతనాలు పెంచడానికి బడ్జెట్ లేదా..?

VZM: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గండిపిల్లి మహేంద్ర బాబు డిమాండ్ చేశారు. విజయనగరంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సోషల్ మీడియా ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు పారితోషికాలు ఇవ్వడంపై మండిపడ్డారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.