హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యుల శిక్షణ పూర్తి

SDPT: బెజ్జంకి మండలంలోని నూతన వార్డు సభ్యులకు మండల పరిషత్ కార్యాలయంలో ఐదు రోజులుగా నిర్వహించిన శిక్షణ శనివారం ముగిసింది. గ్రామపంచాయతీ పాలన, సభ్యుల విధులు, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో ప్రవీణ్, పంచాయతీ అధికారులు పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.