హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో విజయవాడకు ఉద్యోగులు వెళ్లొద్దు'

AKP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు సెప్టెంబర్ 27న చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొనరాదని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరై ప్రజలకు సేవలందించాలన్నారు. అనుమతి లేకుండా గైర్హాజరైతే కేసులు, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.