హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఇళ్ల కూల్చివేతలపై ఎంపీ ఆగ్రహం

MDCL: కంటోన్మెంట్‌లో పేదల ఇళ్ల కూల్చివేతలు, అధికారుల వేధింపులపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. పెద్ద భవనాలకు నోటీసులు ఇవ్వకుండా ఏళ్లుగా చిన్న ఇళ్లలో నివసిస్తున్న పేదలపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. బాధితులను పరామర్శించిన ఆయన, ఇళ్ల కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.