హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సంరక్షణకు ‘జలశ్రీ’

RR: భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ లక్ష్యంగా ‘జలశ్రీ’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. RR కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానాలు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సర్పంచులను కోరారు.