హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి పంటలకు కలిసొచ్చిన వర్షాలు

WGL: ఖరీఫ్ తొలినాళ్లలో వర్షాలు లేక ఇబ్బంది పడ్డ రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. జూన్-ఆగస్టులో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల్లో 197.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం 158.6 మి.మీ. కంటే 24% అధికం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు ఇదే విధంగా కురిస్తే పంటకు లాభం ఉంటుందని తెలిపారు.