హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుపేదలకు ఆపన్నహస్తం సీఎం సహాయనిధి'

SRD: ఆపత్కాలంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన బంటు చరణ్ అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే ద్వారా సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు ఇవాళ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.75 వేల విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.