హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండ్రాజవరంలో వంగవీటి ఆశా కిరణ్ ఆందోళన

E.G: ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటు వివాదంపై ఆయన కుమార్తె ఆశా కిరణ్ శనివారం ఘటనా స్థలంలో బైఠాయించారు. తొలగించిన విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్ఠించాలని ఆమె డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటును శుక్రవారం పోలీసులు అడ్డుకుని, కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు.