హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుచ్చి ఉత్సవానికి పోటెత్తిన భక్తులు

TPT: అప్పలాయగుంటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్లను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. పెరటాసి మాసం రెండో శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.